రింగుల జుట్టు, టిపికల్ స్టయిల్, ఊర మాస్ డైలాగులతో జనాలను పొట్ట చేత పట్టుకునేలా థియేటర్లలో హీరో సిద్ధూ జొన్నలగడ్డ నవ్విస్తున్నాడు. కేవలం రూ. 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన టిల్లూ స్క్వేర్ సినిమా వంద కోట్ల రూపాయల బాక్సాఫీస్ రికార్డు దిశగా దూసుకుపోతోంది. కాస్త గ్యాప్ ఇవ్వు బ్రో అని ప్రేక్షకులు అంటున్నారంటేఘీ స్టార్ బోయ్.. రేంజ్‌ను అర్థం చేసుకోవచ్చు.
సిద్ధూ జొన్నలగడ్డ కెరీర్ మొదట్లో చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా తన ముఖం మీద ఉన్న మచ్చల గురించి ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి అన్న మాటలు ఇప్పటికీ తనను బాధిస్తాయని ఒక సందర్భంగా సిద్ధూ గుర్తు చేసుకున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి, ఒక్కో మెట్టు ఎక్కుతూ, టాలీవుడ్‌లో హీరోగా ఎదిగిన తానేంటో నిరూపించుకున్నాడు.ఈ స్థాయికి రావడానికి 12 ఏళ్లు వేచి చూడాల్సి వచ్చింది.
సిద్దూ కేవలం నటుడు మాత్రమే..అవసరమైతే రైటర్.. డైరెక్టర్ ఏ అవతారమైనా ఎత్తేస్తాడు. ఎందుకంటే లో-బడ్జెట్ కదా. దటీజ్ టిల్లూ..టిల్లు స్క్వేర్‌తో హిట్ కొట్టి డీజే డిల్లు మూవీలో అన్నట్టు అట్లుంటది మనతోని అని చెప్పకనే చెప్పాడు.