వివాహం తర్వాత తన వైవాహిక జీవితాన్ని ఆస్వాదించాల్సిన సమయంలో, నటి రష్మిక మందన్న తీవ్ర మనోవేదనకు గురయ్యారు. గతంలో కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం రద్దయిన సమయంలో, ఆమె తల్లి మాట్లాడిన ఎనిమిదేళ్ల నాటి పాత ఆడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ కావడమే దీనికి కారణం. తన ప్రస్తుత వ్యక్తిగత జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేలా ఎవరో కావాలనే ఈ క్లిప్‌ను తప్పుగా అర్థం వచ్చేలా వైరల్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై రష్మిక నాలుగు పేజీల సుదీర్ఘ లేఖను విడుదల చేస్తూ ఘాటుగా స్పందించారు. ఇది తన వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించడమేనని, పరువు నష్టం కలిగించేలా ఉన్న ఈ కంటెంట్‌ను సోషల్ మీడియా నుండి వెంటనే తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న వారికి 24 గంటల గడువు విధిస్తూ, ఆలోగా స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. గత కొన్నేళ్లుగా తనపై జరుగుతున్న ఆన్‌లైన్ వేధింపులను మౌనంగా భరిస్తూ వచ్చానని, కానీ జీవితంలో కొత్త దశలోకి ప్రవేశించిన ఈ తరుణంలో ఇకపై సహించేది లేదని రష్మిక తేల్చి చెప్పారు. తన వ్యక్తిగత విషయాల్లో హద్దులు దాటితే లీగల్ యాక్షన్‌కు వెనుకాడబోనని స్పష్టం చేస్తూ, పరువు నష్టం, ప్రైవసీ ఉల్లంఘన కింద కేసు నమోదు చేస్తానని నోట్‌లో పేర్కొన్నారు.
Share