Current Date: 06 Oct, 2024

రంగురాళ్ల క్వారీల వద్ద నిఘా

సాధారణ వర్షాలు పడితే రైతుకు పంటల సాగుకు అనుకూలమని ఆనందం. ప్రజలకు తాగునీరు కొరత ఉండదని సంతోషం. అతివృష్టి తో భారీ వర్షాలు కురిస్తే తీవ్ర నష్టం వాటిల్లుతుందని ప్రజలు, రైతులు ఆందోళన చెందుతారు. కానీ భారీ వర్షాలు పడితే రంగురాళ్ల స్మగ్లర్లకు మాత్రం పండగే పండగ. వర్షాలతో నేల తవ్వకాలకు అనుకూలంగా మారుతుంది. కోట్ల రూపాయల విలువైన  వైడూర్యాలు కొల్లగొట్టే రంగురాళ్ల స్మగ్లర్లను నియంత్రించడానికి అటవీ శాఖకు మాత్రం తిప్పలు తప్పవు.

Share