విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జరుగుతున్న కార్మిక ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్పు చేయాలని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణ అన్నారు. ఆదివారం ఉదయం ఆయన కూర్మన్నపాలెంలోని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షా శిబిరం వద్ద పాల్గొని మాట్లాడారు. సుదీర్ఘ కాలంగా జరుగుతున్న పోరాటాలలో ఉక్కు పరిరక్షణ పోరాటం చేరిపోయిందని అన్నారు. ఉక్కు పోరాట ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చి ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్రుల హక్కుగా ఉన్న విశాఖ ఉక్కును పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేయాలన్న దుష్టాలోచనతో ప్రభుత్వాలు ఉన్నాయని ఆయన విమర్శించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నాటి ఉద్యమ స్ఫూర్తితో నేడు ప్రజా ఉద్యమము రావాలన్నారు. ప్రజా ఉద్యమాలతోనే ప్రభుత్వాలు దిగి వస్తాయని సూచించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా మార్చేందుకు ఆదివారం ఉదయం అగనంపూడి నుంచి పాత గాజువాక జంక్షన్ వరకు మానవహారం చేపట్టారు. ఈ మానవ ఆహారంలో కార్మికులు నిర్వాసితుల కుటుంబాలతో పాటు ప్రజలు భాగస్వాములు అయ్యారు.
Share