ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) ఛైర్మన్గా మంతెన రామరాజు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనను నమ్మి ఇంత గొప్ప అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, కూటమి పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఏపీఐఐసీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని అన్నారు. ఏపీఐఐసీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన మంతెన రామరాజును కలిసి మంత్రి కొల్లు రవీంద్ర శుభాకాంక్షలు తెలిపారు. ఏపీఐఐసీ కార్యాలయానికి వెళ్లి సత్కరించారు.
Share