జిల్లాలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల వలన జరిగిన నష్టం వివరాలను తక్షణమే అందజేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముందు జిల్లా అధికారులతో సమన్వయ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, జిల్లా రెవిన్యూ అధికారి కె.మోహన్ కుమార్, ఆర్.డీ.ఓ డి.హుస్సేన్ సాహెబ్ లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాల నేపథ్యంలో జరిగిన నష్టం నివేదికలను కలెక్టర్ కార్యాలయానికి సోమవారం సాయంత్రంలోగా సమర్పించాలని వ్యవసాయ, ఉద్యానవన శాఖలు, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్, నీటిపారుదల, జీవీఎంసి, విద్యుత్, ఫైర్ తదితర శాఖలను కలెక్టర్ ఆదేశించారు. ఆ నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్లు, జిల్లా అధికారులు, జీవీఎంసీ, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Share