రావణా పల్లి రిజర్వాయర్ కు సోమవారం సాయంత్రం గండి పడింది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఈ రిజర్వాయర్ లో పూర్తిస్థాయి నీటి మట్టం కిచేరింది. ఈ రిజర్వాయర్ కి గేట్లు లేవు. దీంతో అదనంగా చేరే వరదనీరు పొర్లు కట్టు ద్వారా బయటకు పోతుంది. వర్షపు నీరు కాలువల ద్వారా ప్రవహిస్తుంది. అయినప్పటికీ భారీ వర్షాలతో ఎగువు నుంచి వచ్చి చేరుతున్న వరద నీరు ఉధృతికి రిజర్వాయర్ గట్లు బలహీనపడ్డాయి. సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆర్డిఓ హెచ్. వి. జయరాం, పోలీసులు, నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి హుటాహుటిన గండిపడిన ప్రదేశానికి చేరుకున్నారు. ఇసుక బస్తాలతో గండిని పూడ్చివేశారు. ఆర్డిఓ వెంట నర్సీపట్నం, గబ్బాడ, రావణా పల్లి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు రాజబాబు, గవిరెడ్డి వెంకటరమణ తదితరులు ఉన్నారు.
Share