తాజాగా నాసా ప్రయోగించిన ఐస్‌శాట్-2 ఉపగ్రహం ద్వారా ఇస్రో కొన్ని ఫోటోలు సేకరించింది. ఈ ఫోటోల్లో రామసేతు నిర్మాణం కన్పిస్తోంది. ఇస్రో రూపొందించిన 10 మీటర్ల మ్యాప్‌లో వంతెన మొత్తం స్పష్టంగా ఉంది. రామసేతు వంతెనకు సంబంధించి 2018-2023 మధ్య ఉన్న డేటాను సిద్ధం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం చేశారు. సముద్రగర్భం నుంచి దాదాపు 8 మీటర్ల ఎత్తులో ఉంటుందని తేల్చారు. రామసేతులో 99.98 శాతం నీటిలో మునిగిపోయిందని, కొద్ది భాగం మాత్రమే బయటకు కన్పిస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో ఉన్న ధనుష్కోటి నుంచి శ్రీలంకలోని మన్నార్ ద్వీపం తలైమన్నార్ వరకూ ఈ వంతెనను అప్పట్లో పెద్ద పెద్ద బండ రాళ్లు, సున్నం ఉపయోగించి చేపట్టినట్టు తెలుస్తోంది. నాసా సహాయంతో ఇస్రో సేకరించిన ఫోటోలతో తొలిసారిగా సముద్రగర్భంలో కలిసిపోయిన వంతెన ఫోటోల్లో స్పష్టంగా కన్పిస్తోంది.
Share