ఢిల్లీ విమానాశ్రయంలో దేశీయ ప్రయాణికులకు త్వరలో మద్యం దుకాణం అందుబాటులోకి రానుంది. టర్మినల్ 3లో ఈ స్టోర్‌ను ప్రారంభించేందుకు ఢిల్లీ కన్జ్యూమర్స్ కోఆపరేటివ్ హోల్‌సేల్ స్టోర్‌కు ఎక్సైజ్ శాఖ అనుమతులు జారీ చేసింది. ఐజీఐ ఎయిర్‌పోర్టులో తొలి ఎల్ - 10 స్టోర్ ఇదేనని అధికారులు తెలిపారు. ఈ లిక్కర్ స్టోర్‌లో సెల్ఫ్ సర్వీస్ విధానం అమల్లో ఉంటుందని, 750 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు పేర్కొన్నారు. రాత్రి పగలూ, సెలవులు అనే తేడా లేకుండా నిత్యం అందుబాటులో ఉండే షాపులో కస్టమర్లకు ఎక్సై్జ్ శాఖ అనుమతి పొందిన దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్లన్నీ అందుబాటులో ఉంటాయని తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న స్టోర్‌లో దేశవ్యాప్తంగా మద్యం ధరలను చూపించే డిస్ప్లే స్క్రీన్లు కూడా అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేయొచ్చన్నారు.
Share