సినీ నటుడు, వైయస్ఆర్సీపీ నేత పోసాని కృష్ణ మురళికి చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. గత అయిదేళ్లుగా అనేక ప్రెస్ మీట్ పెట్టి.. అందులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌ను ఏకవచనాలు, తిట్లతో చెలరేగిపోయాడు. దాంతో.. ఇప్పుడు కూటమి నేతలు ప్లాన్డ్ గా ఏపీలో కేసుల మీద కేసులు పెడుతున్నారు.తొలుత పోలీసుల నుంచి నోటీసులు అందుకోవడం, ఆయా ఊళ్లకు వెళ్లి, పోలీసులతో మాట్లాడి రావడం తప్పదు. మిగిలిన వారిలా రాత్రికి రాత్రి ఎత్తుకు రాకపోవచ్చు. లేదా చటుక్కున అరెస్ట్ ఉండకపోవచ్చు. కానీ ఆ దిశగా చర్యలు తీసుకోబోతున్నారనేద మాత్రం స్పష్టం. ఏదో టైమ్ లో పోసాని కూడా అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. సరే బెయిల్ వస్తుందా.. ఎన్ని రోజులు రిమాండ్ లో ఉంటారు? అనేది కాలం నిర్ణయించాలి. ప్రస్తుతానికి ఆర్జీవీ, శ్రీరెడ్డి, పోసాని అరెస్ట్ రేసులో ఉన్నారు.
Share