Current Date: 16 Nov, 2024

షార్జా విమానానికి బాంబు బెదిరింపు

హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. నగరం నుంచి షార్జా వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు ఎక్కాడు. ఫ్లైట్ ఎక్కిన తర్వాత సదరు ప్రయాణికుడు తన వద్ద బాంబు ఉందంటూ కేకలు వేశాడు. విమానాశ్రయ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని, అతనిని, లగేజీని తనిఖీ చేశారు. కానీ ఎలాంటి బాంబును గుర్తించలేదు. ఈ ఘటన జరిగినప్పుడు విమానంలో 136 మంది ప్రయాణికులు ఉన్నారు. మొదట వారిని కిందకు దించారు. విమానాన్ని ఐసోలేషన్ ప్రాంతానికి తీసుకెళ్లి తనిఖీలు చేశారు.

Share