ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, నీతూ అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగవైభంగా జరిగింది. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌లు వివాహం బంధంతో ఒక్కటయ్యారు. అంబానీ ఇంట మూడురోజులపాటు పెళ్లి వేడుకలకు దేశ, విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు, ఇతర రంగాల్లోని సెలబ్రిటీలంతా ఈ వివాహానికి తరలివచ్చారు. పెళ్లికి ముందు తర్వాత జరిగే కార్యక్రమాలన్నీ అట్టహాసంగా జరిగాయి. కొద్ది రోజులపాటు ఎక్కడ చూసినా అనంత్ అంబానీ పెళ్లి గురించే చర్చించుకున్నారు. ఇదిలా ఉంటే రాధిక మర్చంట్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. పెళ్లైన నాలుగు నెలలకు రాధిక మర్చంట్ తన పేరును మార్చుకున్నారు. రాధిక మర్చంట్ పెళ్లై ఇన్ని రోజుల తర్వాత అధికారింగా అంబానీ కుటుంబంలో కలిసిపోయారు. ఆల్రెడీ ఇప్పటికే అఫిషీయల్‌గా కోడలు అయిపోయింది కదా అనుకుంటున్నారా? అవును కానీ.. ఇప్పుడు పేరును కూడా అధికారికంగా ప్రకటించింది. మర్చంట్ ప్లేస్‌లో అంబానీ అని మార్చుకున్నారు.అధికారికంగా పేరులో మార్పు చేసుకున్నారు. రాధిక మర్చంట్ తన అత్తవారి ఇంటి పేరు పెట్టుకోవడానికే మొగ్గు చూపించారు.
Share