Current Date: 27 Nov, 2024

షేక్ హసీనాను అరెస్ట్ చేసి అప్పగించండి భారత్‌ను కోరిన బంగ్లాదేశ్ సుప్రీంకోర్ట్ బార్ అసోయేషన్

బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి ప్రస్తుతం భారత్‌లో తలదాచుకుంటున్న ఆమెను అప్పగించాలంటూ డిమాండ్లు మొదలయ్యాయి. షేక్ హసీనాను అరెస్ట్ చేసి ఆమెను తమ దేశానికి అప్పగించాలంటూ బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్  అధ్యక్షుడు ఏఎం మహబూబ్ ఉద్దీన్ ఖోకాన్ భారత్‌ను కోరారు. ఈ మేరకు ఆయన మీడియాతో మంగళవారం మాట్లాడారు. షేక్ హసీనాతో పాటు ఆమె సోదరి షేక్ రెహానాలను అరెస్టు చేయాలని అన్నారు. బంగ్లాదేశ్‌లో మరణాలకు షేక్ హసీనా బాధ్యత వహించాలని పేర్కొన్నారు. కాగా భారత్‌తో సానుకూల సంబంధాలను కొనసాగించడం తమకు ముఖ్యమని ఆయన స్పష్టం చెప్పారు. దేశంలో అనేక మరణాలకు షేక్ హసీనా కారణమని, చాలా మందిని బలిగొన్నారని అన్నారు.

Share