సోషల్ మీడియా పిచ్చి ప్రపంచవ్యాప్తంగా పీక్స్‌కి చేరింది. లైక్స్ కోసం ఫాలోవర్లను పెంచుకోవడానికి ఎంతకైనా నెటిజన్లు దిగజారుతున్నారు. కొందరు ప్రాణాలను పనంగా పెడుతుంటే.. మరికొందరు ఆత్మగౌరవాన్ని, సిగ్గును కూడా వదిలేస్తున్నారు. ఎలాగైనా పాపులర్ అవ్వాలని వ్యక్తిగత జీవితాలను కూడా బజార్లో పెట్టేసుకుంటున్నారు.ఇటీవల ఓ కొత్త జంట ఏకంగా తమ మొదటి రాత్రి వీడియోను సోషల్ మీడియాలో పెట్టేసింది. కొత్తగా పెళ్లైన జంటకు శోభనం ఏర్పాటు చేశారు. గదిని పూలతో అలంకరించారు. అయితే నాలుగు గోడల మధ్య జరగాల్సిన ఈ కార్యాన్ని కాస్త మనోడు అత్యుత్సాహంతో సోషల్ మీడియాలో పెట్టేశాడు. పూలతో అలంకరించిన మంచాన్ని వీడియోలో చూపిస్తూ, తన భార్యను పిలిచి మరీ నెటిజన్లతో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.ఈ వీడియోలో సదరు వ్యక్తి మాట్లాడుతూ.. 'హాయ్ ఫ్రెండ్స్.. ఈ రోజు మా ఫస్ట్ నైట్ జరగబోతోంది.. మంచాన్ని సువాసన వెదజల్లే పూలతో ఎంతో అందంగా అలంకరించారు' అని చెప్పుకొచ్చాడు. అంతటితో ఆగకుండా తన భార్యతో సైతం వీడియోలో మాట్లాడించాడు. ఈ వీడియో కాస్త తెగ వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. దాంతో గంటల వ్యవధిలో ఆ పోస్ట్‌ని డిలీట్ చేశాడు.
Share