Current Date: 05 Oct, 2024

మనవడితో స్కూల్‌కి వెళ్లిన సూపర్ స్టార్ రీజనిదే

తమిళ సూపర్  స్టార్ రజనీకాంత్ నిత్య జీవితంలో చాలా సింపుల్ గా కనిపిస్తారు. ఎప్పుడూ సినిమా షూటింగులతో బిజీగా ఉండే ఆయన, తాజాగా తన మనువడిని స్కూల్ కి తీసుకెళ్లారు. వీకెండ్ వస్తుండటంతో స్కూల్‌కు వెళ్లనని అలిగిన మనవడిని బుజ్జగించి ఆయనే స్వయంగా కారులో తీసుకెళ్లి క్లాసులో దిగబెట్టి వచ్చారు. ఈ విషయాన్ని రజనీకాంత్ కుమార్తె సౌందర్య సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. “ఆఫ్ స్క్రీన్ లో అయినా, ఆన్ స్క్రీన్ లో అయినా, ప్రతి పాత్రను చక్కగా పోషిస్తారు నాన్నా” అంటూ క్యాన్షన్ పెట్టింది.
రజనీకాంత్ మనువడిని కారులో తీసుకెళ్లి, క్లాస్ రూమ్ లో దిగబెట్టిన ఫోటోలను షేర్ చేసింది. వేద్ ను స్కూల్ కు తీసుకెళ్లమే కాదు, స్వయంగా క్లాస్ రూమ్ లోకి తీసుకెళ్లారు రజనీకాంత్. అక్కడ తలైవాను చూసి వేద్ తోటి విద్యార్థులు ఆశ్చర్యపోయారు. సూపర్ స్టార్ సూపర్ స్టార్ అంటూ సంతోషం కేరింతలు కొట్టారు. ఎప్పుడూ సినిమాల్లో కనిపించే ఆయన, నేరుగా తమ క్లాస్ రూమ్ లో కనిపించడంతో వారి సంతోషానికి అవధుల్లేకుండాపోయాయి.

Share