ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో ఇప్పుడు టీడీపీకి పెద్ద తలనొప్పి మొదలైంది. సనాతన మార్గాన్ని ఎంచుకున్న పవన్.. తిరుపతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, వారాహి డిక్లరేషన్ కూడా ప్రకటించారు. కానీ.. ఈ సభలో టీడీపీ నేతలెవరూ కనిపించలేదు.పవన్ గత కొన్ని రోజులుగా వ్యవహరిస్తున్న తీరుతో టీడీపీ కాస్త వెనుకడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే లడ్డూ వ్యవహారం విషయంలో చంద్రబాబు కాస్త తొందరపడి నోరుజారినట్లు భావిస్తున్న టీడీపీ.. పవన్‌కల్యాణ్ తీరుతో ఇప్పుడు ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలతో పాటు దళితుల్ని, ఇతర అణగారిన వర్గాల్ని కూటమి ప్రభుత్వానికి దూరం చేసేలా కనిపిస్తున్నాయి.టీడీపీతో ఏ మాత్రం సంబంధం లేకుండా పవన్ గత కొన్ని రోజుల నుంచి సొంత ఎజెండాతో ముందుకు వెళ్లిపోతున్నారు. బీజేపీ హిందుత్వ ఎజెండాని భుజాలపైకి వేసుకున్నట్లు కనిపిస్తోంది. అపరిమితమైన అధికారం చేతిలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నట్లు సభలో, ఉద్యమాలు, నిరసనలు చేయడమేంటి అనే చర్చ మొదలైంది.
Share