సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన గుండెలోని రక్తనాళానికి వాపు రావడంతో వైద్యులు శస్త్ర చికిత్స లేకుండా స్టెంట్ అమర్చారు. అస్వస్థత కారణంగా గత సోమవారం రాత్రి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరగా.. తాజాగా డిశ్చార్జ్ అయ్యారు. కనీసం 15 రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది.ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రజనీకాంత్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.‘‘నేను ఆస్పత్రిలో ఉన్నప్పుడు త్వరగా కోలుకోవాలని శుభాకాంక్షలు తెలిపిన రాజకీయ నాయక మిత్రులకు, సినీ రంగానికి చెందిన స్నేహితులకు, నా క్షేమం కోరిన మీడియా మిత్రులకు, నన్ను బతికిస్తున్న ఫ్యాన్స్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని రజనీకాంత్ అందులో చెప్పుకొచ్చారు.రజనీ అనారోగ్యానికి గురైన విషయం తెలిసి ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌తో సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక అభిమానులైతే గుళ్లు, గోపురాలు, చర్చిలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Share