భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ తన మాజీ భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకోవాలని భావించాడట. 2018 అతడి భార్య హసీన్ జహాన్ పెట్టిన గృహహింస కేసు అలానే ఆమె చేసిన ఫిక్సింగ్ ఆరోపణలు అతని కెరీర్‌ను కుదిపేశాయి. ఆ టైంలోనే షమీ ఎంతో మనోవేదనకు గురైనట్లు.. ఆత్మహత్య కూడా చేసుకోవాలని భావించినట్లు తన స్నేహితుడు ఉమేశ్ కుమార్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కేసు, ఆరోపణల సమయంలో నాతో పాటు షమీ మా ఇంట్లోనే ఉండేవాడు. ఫిక్సింగ్ ఆరోపణలు రావడం దానిపై విచారణ జరగడంతో మానసికంగా కుమిలిపోయాడు. అన్నింటినీ సహించగలను కానీ నా దేశానికి ద్రోహం చేశానన్న ఆరోపణలు మాత్రం నేను సహించలేనని నాతో అన్నాడు. ఆరోజు ఉదయం 4 గంటలకు నీరు తాగేందుకు గది నుంచి బయటకు వచ్చి చూడగా షమీ బాల్కనీలో నిల్చొని ఉన్నాడు. మా ఫ్లాట్ 19వ అంతస్తులో ఉంది. అప్పుడే ఏం జరుగుతుందో నాకర్థమైంది. షమీ కెరీర్లోనే ఆ రాత్రి చాలా సుదీర్ఘమైనది' అని ఉమేశ్ చెప్పాడు. 2018 ఐపీఎల్‌కి ముందు షమీకి ఫిక్సింగ్ ఆరోపణలపై బీసీసీఐ నుంచి క్లీన్‌చిట్ వచ్చింది. అలానే కేసు కూడా ఓ కొలిక్కి వచ్చి భార్యతో విడిపోయాడు. దాంతో మళ్లీ కెరీర్‌పై ఫోకస్ పెట్టిన షమీ.. ఇప్పుడు తిరుగులేని బౌలర్‌గా ఎదిగాడు.
Share