కేంద్ర ప్రభుత్వం పసిడి దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు సెంట్రల్ బడ్జెట్‌లో ప్రకటించడంతో బంగారం ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. బడ్జెట్ రోజున ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే తులం బంగారం దాదాపు రూ.3000 మేర పడిపోయింది. అలానే అంతర్జాతీయ మార్కెట్లలోనూ బంగారం ధరలు దిగివచ్చాయి. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. గత వారంలో రూ.4000 పైన పడిపోయిన 24 క్యారెట్ల బంగారం రేటు ఇవాళ ఏ మార్పు లేకుండా 10 గ్రాములకు రూ.70 వేల 860 వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల నగల తయారీ బంగారం తులానికి రూ.64 వేల 950 వద్ద ఉంది. ఢిల్లీ మార్కెట్లో చూస్తే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు తులం రూ.71,010 వద్ద ఉంది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.65 వేల 100 వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ వెండి రేటు మరింత పడిపోయింది. గత వారంలో కిలో వెండి రేటు రూ.7000 మేర తగ్గగా ఇవాళ మరో రూ.500 దిగివచ్చింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 92 వేల వద్దకు దిగివచ్చింది.
Share