ఐపీఎల్ 2024లో ప్లేఆఫ్స్ ముంగిట రాజస్థాన్ రాయల్స్‌కి చేదు అనుభవం ఎదురైంది. పంజాబ్ కింగ్స్‌తో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో రాజస్థాన్‌కి ఓటమి తప్పలేదు. అయితే.. మిగిలిన జట్ల పేలవ ప్రదర్శన కారణంగా రాజస్థాన్ టీమ్ ప్లేఆఫ్స్ బెర్తుని ఖాయం చేసుకుంది. అలానే టాప్‌లో ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగలిగింది. ఇక ఆ జట్టు నెం.1 స్థానానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు. ఐపీఎల్ చరిత్రలో ఇలా కోల్‌కతా టీమ్ ఫస్ట్ ప్లేస్‌లో ఉండి లీగ్ దశని ముగించడం ఇదే తొలిసారి.
మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ టీమ్ 9 వికెట్ల నష్టానికి 144 పరుగులే చేయగలిగింది. ఆ తర్వాత లక్ష్యఛేదనలో పంజాబ్ కింగ్స్ టీమ్ 18.5 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది.
ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ ఉంది. రెండు జట్లకీ ఇదే ఆఖరి మ్యాచ్‌కాగా.. ప్లేఆఫ్స్ చేరాలంటే హైదరాబాద్ తప్పక గెలిచి తీరాలి. మరోవైపు గుజరాత్ టైటాన్స్ ఆశలు ఇప్పటికే ఆవిరైపోయాయి. దాంతో ఆ జట్టు విధ్వంసకరంగా ఆడే అవకాశం ఉంది.