Current Date: 26 Nov, 2024

సీఎం జగన్ ఇంట్లో ముగిసిన యాగం.. 41 రోజులు సీక్రెట్‌గా!


ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసింది. దాంతో మొన్నటి వరకు 
ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపిన సీఎం జగన్ ఇప్పుడు కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలోనే కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ దేశాల్లో పర్యటన కోసం సీబీఐ కోర్టు అనుమతి కూడా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో 41 రోజులుగా తన ఇంట్లో నిర్వహిస్తున్న యాగాన్ని కూడా జగన్ పూర్తి చేశారు.

సీఎం జగన్ తాడేపల్లి నివాసంలో గత 41 రోజులుగా రాజశ్యామల చండీయాగం జరుగుతోంది. ఇందులో భాగంగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. వైసీపీ మరోసారి అధికారంలోకి రావాలని, ప్రజాహిత పాలన కొనసాగాలని కోరుతూ ఈ యాగం నిర్వహిస్తున్నారు. 41 రోజులుగా జరుగుతున్న ఈ యాగాన్ని బుధవారం ముగించారు.

ఈ రాజశ్యామల సహస్ర చండీయాగాన్ని నల్లపెద్ది శివరామప్రసాదశర్మ, గౌరావర్జుల నాగేంద్రశర్మ నిర్వహించారు.  యాగంలో 45 మంది వేద పండితులు పాల్గొన్నారు. పూర్ణాహుతికి ఉపయోగించే ద్రవ్యాలకు సీఎం వైయస్‌.జగన్‌తో షోడషోపచార పూజలు చేయించిన వేద పండితులు...అనంతరం ముఖ్యమంత్రికి ఆశీర్వచనాలు అందించారు.