Current Date: 06 Oct, 2024

సింహాద్రినాధుడికి వైభవంగా సహస్ర నామార్చన

విశాఖ నగరంలోని సింహాచలం లోని సింహగిరిపై కొలువైన అప్పన్న స్వామి సన్నిధి లో సహస్రనామార్చన ప్రత్యేక పూజా కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. అర్చకు లు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ఆరాధన, బాలభోగం సేవలు జరిపారు. శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజ స్వామిని పట్టు పీతాంబరా లు, ఆభరణాలతో అలంకరించి ఆలయ కల్యాణ మండపంలోని ఉత్సవ వేదికపై ఆశీనులను చేశారు. తులసీ దళాలతో స్వామిని సహస్రనామాలతో అర్చించారు. అనంతరం అదే వేదికపై దేవతామూర్తుల నిత్య కల్యాణోత్సవాన్ని కనులపండువగా జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామిని సేవించారు. అర్చకులు వేద మంత్రాలతో భక్తులను ఆశీర్వదించి కల్యాణ తలంబ్రాలు, శేష వస్త్రాలు అందజేశారు