ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న పింఛన్ల పంపిణీకి సంబంధించి కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ నెలకు సంబంధించి ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 1న ఆదివారం కావడంతో నవంబర్ 30వ తేదీనే అంటే శనివారం పెన్షన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది. ఒకేవేళ ఆరోజు తీసుకోలేని వారికి డిసెంబర్ 2న, లేదంటే వచ్చే నెల 1న రెండు నెలల పెన్షన్లను పొందొచ్చని కూటమి ప్రభుత్వం తెలిసింది. ఈ మేరకు తెలియజేస్తూ ప్రకటన జారీ చేసింది. పింఛన్ తీసుకునేందుకు లబ్ధిదారులు సుదూర ప్రాంతాల నుంచి పరుగుపరుగున ఒకటో తేదీన టెన్స్ న్ గా చేరుకునేవారు. ఇకపై ఆ బెంగ కూడా లేదు. ఎందుకంటే.. ఒక నెల పింఛన్ తీసుకోని వారికి ఆ తర్వాత నెలలో దానిని కలిపి రెండు నెలల నగదును ఒకేసారి ఇవ్వనున్నారు. అలాగే వరుసగా 2 నెలలు పింఛన్ తీసుకోని వారికి 3వ నెలలో మూడు నెలలకు కలిపి పింఛన్ డబ్బులు అందజేస్తారు. డిసెంబర్ నెల నుంచే ఈ నిబంధనను అమలు చేస్తున్నారు. అయితే వరుసగా మూడు మాసాలు తీసుకోపోతే మాత్రం శాశ్వత వలసగా పరిగణించి.. ఆ లబ్ధిదారులకు ప్రభుత్వం పింఛన్ తొలగిస్తుంది.
Share