Current Date: 26 Nov, 2024

రష్మికని ఇరుకున పెట్టిన బాయ్‌ఫ్రెండ్ తమ్ముడు!

రష్మిక మంధాన పేరు చెప్పగానే చాలామందికి విజయ్ దేవరకొండనే గుర్తొస్తాడు. ఎందుకంటే వీళ్లిద్దరూ ఫ్రెండ్సా? లవర్సా? అనేది ఇప్పటికీ సస్పెన్సే. ఈ జంట పెళ్లి గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. తాజాగా విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రష్మిక పాల్గొంది.ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన 'గం గం గణేశా'.. మే 31న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‍‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన రష్మికని ఆనంద్ దేవరకొండ చాలా ప్రశ్నలు అడిగాడు. నీ ఫేవరెట్ కో స్టార్ ఎవరు? అని రష్మికని ఆనంద్ అడగ్గా.. మైక్ పక్కకు పెట్టి నీ యబ్బ అని ఆనంద్‌ని సరదాగా తిట్టింది.ఆ వెంటనే మైక్ లో.. ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీరా, ఇలా స్పాట్‌లో పెడితే ఎలా అని అనడంతో ఈవెంట్‌కి వచ్చిన వాళ్లందరూ రౌడీ, రౌడీ స్టార్ అని అరిచారు. దీంతో రౌడీ బాయ్ నా ఫేవరేట్ అని విజయ్‌ని ఉద్దేశించి రష్మిక చెప్పింది. ఇలా రష్మిక-విజయ్ ఎంత క్లోజ్ అనేది మరోసారి ప్రూవ్ అయింది.