వైయస్ జగన్, షర్మిల మధ్య మళ్లీ వివాదం రాజుకుంది. సుమారుగా అయిదేళ్లు కిందట కుదర్చుకున్న ఒప్పందం గురించి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అప్పట్లో తల్లి విజయమ్మకి గిఫ్ట్ డీడ్ రూపంలో ఇచ్చిన షేర్లను రద్దు చేయాలని జగన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించడం పెద్ద దుమారం రేపుతోంది.సీబీఐ, ఈడీ కేసుల్లో ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న జగన్‌ని ఇబ్బంది పెట్టడానికి పక్కా వ్యూహంతో షర్మిలను కొంత మంది పావుగా వాడుతున్నట్లు వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. తల్లి విజయమ్మకి వచ్చిన షేర్లను షర్మిల పేరిట బదలాయించి.. తద్వారా జగన్‌ను ఇబ్బంది పెట్టి బెయిలు కూడా రద్దయ్యే పరిస్థితి కల్పించడానికి ఒక వ్యూహం ప్రకారం ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది గ్రహించిన జగన్ లీగల్‌గా స్టెప్ తీసుకున్నారు.వాస్తవానికి వైయస్ ఉన్నపుడే వారసత్వంగా వచ్చిన ఆస్తుల్లో జగన్‌కూ, షర్మిళకూ మధ్య పంపకాలు పూర్తయ్యాయి. సీబీఐ కేసులు, ఈడీ కేసులతో వైయస్ జగన్ స్వార్జితానికి సంబంధించిన ఆస్తులు, కంపెనీలన్నీకూడా అటాచ్మెంట్లోకి వెళ్లిపోయాయి.కేసుల్లో ఆస్తులు ఉన్నందున వాటిని నేరుగా బదిలీచేయడానికి చట్టపరంగా ఆస్కారం లేనందున తన చెల్లెలకు నమ్మకం కలిగించేందుకు అవగాహనా ఒప్పందాన్నిజగన్ రాసిచ్చారు. ఇప్పుడే అదే తలనొప్పిగా మారింది.
Share