న్యూజిలాండ్ చేతిలో తొలి టెస్టులో ఓడిన భారత్ జట్టు.. ఈరోజు నుంచి పుణె వేదికగా రెండో టెస్టులో ఆడనుంది. బెంగళూరులో ప్రతికూల పిచ్ దెబ్బకు అనూహ్యంగా దెబ్బతిన్నా.. రెండో టెస్టులో విజయమే లక్ష్యంగా రోహిత్ శర్మ బృందం బరిలోకి దిగుతోంది. పిచ్‌పై అంచనా తప్పడంతో 0–1తో సిరీస్‌లో వెనుకబడిన భారత్ ఈసారి ఎలాంటి అవకాశం ఇవ్వరాదని భావిస్తోంది.పుణెలో ఈరోజు పూర్తిగా స్పిన్‌కు అనుకూలించే పిచ్‌ను రూపొందించి ప్రత్యర్థికి సవాల్ విసురుతోంది. ఈ నేపథ్యంలో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. అనారోగ్యం నుంచి కోలుకున్న టాపార్డర్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ మ్యాచ్‌కు అందుబాటులో ఉన్నాడని మేనేజ్మెంట్ ప్రకటించింది. అయితే గిల్ వస్తే ఎవరిని తప్పిస్తారనేది ఆసక్తికరం.సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్‌లో ఒక్కరికే ఛాన్స్ దక్కనుంది. సర్ఫరాజ్ ఖాన్ బెంగళూరు టెస్టులో 150 పరుగులు చేయగా.. కేఎల్ రాహుల్ ఫెయిలయ్యాడు. అయితే.. హెడ్ కోచ్ గంభీర్ రాహుల్‌కి మరో ఛాన్స్ ఇస్తామని సంకేతాలు ఇచ్చాడు. కానీ.. అభిమానులు మాత్రం సెంచరీతో ఫామ్‌లో ఉన్న సర్ఫరాజ్ ఖాన్‌కి ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దాంతో మ్యాచ్ టాస్ నుంచే ఆసక్తిగా ఉండనుంది.
Share