Current Date: 26 Nov, 2024

TDP who put Kodali Nani under tension.. Finally relief!

గుడివాడ వైసీపీ ఎమ్మెల్ అభ్యర్థి కొడాలి నాని ఊపిరి పీల్చుకున్నారు. ఎమ్మెల్యే కొడాలి నాని మంత్రిగా ఉన్నప్పుడు పాత మున్సిపల్‌ కార్యాలయంలో క్యాంప్‌ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. మంత్రి పదవి పోయినా దానిని అలాగే కొనసాగిస్తూ వైకాపా కార్యాలయంగా మార్చేసి వాడుకుంటున్నారు. ఐదేళ్లు ప్రభుత్వ భవనాన్ని నాని వాడుకున్నారంటూ మున్సిపల్‌ కమిషనర్‌ ధ్రువీకరించారు.

కానీ.. నాని మాత్రం తన నామినేషన్‌ అఫిడవిట్‌లోని 17వ పేజీలో ప్రభుత్వానికి సంబంధించిన అకామిడేషన్‌ వాడుకున్నారా అన్న దగ్గర ‘ఎస్‌’ అని పెట్టకుండా ‘నో (లేదు)’ అని పెట్టారు. కార్యాలయం వినియోగించుకున్నందుకు సంబంధిత బిల్లులు, బకాయిలుంటే అవీ చూపించాలి. అవేవీ చూపించలేదు. నాని నామినేషన్‌ను తిరస్కరించడానికి టీడీపీ ఇవి కారణంగా చూపించింది. దాంతో శుక్రవారం మొత్తం హడావుడి నడిచింది. నాని నామినేషన్‌ను తిరస్కరించబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

కానీ.. ఆర్వో సంతకం చేస్తూ నామినేషన్‌ను యాక్సెప్ట్ చేశారు. దాంతో ఆర్వో ఇంత దారుణంగా ఉండటం చూస్తే.. అసలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా అనే సందేహం కలుగుతోందంటూ టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది. మరోవైపు కొడాలి నాని మాత్రం ఊపిరి పీల్చుకున్నారు.