Current Date: 26 Nov, 2024

పెళ్లి గౌనులో మళ్లీ సమంత.. కానీ పూలు మిస్సింగ్!

సీనియర్ హీరోయిన్ సమంత పేరు చెప్పగానే ఆమె పెళ్లి, విడాకులే చాలామందికి గుర్తొస్తాయి. ఎందుకంటే కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు అక్కినేని హీరో నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఎన్నాళ్లు బంధాన్ని నిలబెట్టుకోలేకపోయింది. కారణమేంటో గానీ విడాకులు తీసేసుకుంది.

విడాకుల తర్వాత ఒంటరిగానే ఉంటోంది. పెళ్లి నాలుగేళ్లకే
పెటాకులు అయినా.. సామ్ దగ్గర ఆ జ్ఞాపకాల ఇంకా అలానే ఉన్నాయి. ఇప్పుడు వాటితో ప్రయోగం చేసింది. పెళ్లిలో సమంత.. వైట్ కలర్ వెడ్డింగ్ గౌన్ ఒకటి అప్పట్లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. అయితే పెళ్లి, విడాకులు తర్వాత దాని అవసరం ఉండకపోవచ్చు.

కానీ దాన్ని అలానే జాగ్రత్తగా దాచుకున్న సమంత.. ఇప్పుడు ఆ గౌన్‌కి ఉన్న చిన్న చిన్న పూలని తీసి కొత్త డ్రస్ కోసం ఉపయోగించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామ్ ఇన్ స్టాలోనే  ఉంది. పెళ్లి జీవితం సరిగా లేనప్పటికీ.. ఆ జ్ఞాపకాల్ని ఇంకా పదిలంగా అలా ఉంచుకోవడం ఇంట్రెస్టింగ్ విషయమే.