బెంగళూరు నగర శివారులో జరిగిన రేవ్ పార్టీ వ్యవహారం దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ పార్టీలో పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటంతో పాటు ప్రముఖులు కూడా పాల్గొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రేవ్ పార్టీ జరిగిన ఫామ్‌హౌజ్ హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యక్తిదిగా పోలీసులు గుర్తించారు. అయితే, ఈ రేవ్ పార్టీలో ప్రముఖ తెలుగు నటి హేమ కూడా ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది.
దీనిపై హేమ స్పందించారు. రేవ్ పార్టీలో తాను ఉన్నట్లు వస్తోన్న ప్రచారాన్ని ఖండిరచారు. ప్రస్తుతం తాను హైదరాబాద్‌లోనే ఉన్నట్లు ఓ వీడియో విడుదల చేశారు. ‘ఆల్రేడీ ఇక్కడే హైదరాబాద్‌లోని ఓ ఫామ్‌హౌజ్‌లో ఎంజాయ్ చేస్తున్నాను. బెంగళూరు రేవ్ పార్టీతో నాకు సంబంధం లేదు. ఇందులోకి నన్ను అనవసరంగా లాగుతున్నారు. నా గురించి వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు’ అని హేమ స్పష్టం చేశారు.
కాగా, మరోవైపు ఈ రేవ్ పార్టీలో పోలీసులకు డ్రగ్స్, కోకైన్ లభ్యమయ్యాయి. దీనిలో ముఖ్యంగా తెలుగు రాష్టాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగుళూరు పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీలో తెలుగు సీనీ ఇండస్టీకి చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.