విమానం టేకాఫ్ సమయంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచే యత్నం...
Mar 18, 2025
ఇండిగో విమానంలో ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి వారణాసి వెళ్తున్న 6ఈ 6719 ఇండిగో విమానం సాయంత్రం 4.18 గంటలకు టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో బిహార్ కు చెందిన సౌరవ్‌కుమార్ చల్భే ఎమర్జెన్సీ డోర్ తెరవడానికి యత్నించగా ఎయిర్‌లైన్స్ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఎయిర్‌లైన్స్ అధికారులతో వాగ్వాదానికి దిగాడు. విమానం దిగిన తర్వాత ఎయిర్‌పోర్టు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సౌరవ్‌కుమార్ హైదరాబాద్‌లో చదువుకుంటున్నాడని, అతడిపై న్యూసెన్స్ కేసు నమోదు చేశామని సీఐ బాల్‌రాజ్ తెలిపారు.