ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ మరోసారి హాట్ టాపిక్ అయింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల అంశంపై తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందా? లేదా? అనే అంశం జనాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ మంత్రి వాలంటీర్ల వ్యవస్థపై అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీరు వ్యవస్థ కొనసాగుతున్నట్లు ప్రకటించారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఉన్న వాలంటీర్లకు వేతనాలు పెంచే ప్రతిపాదనపై ప్రభుత్వం కసరత్తులు చేస్తోందని చెప్పారు. దీంతో వాలంటీర్ల వ్యవస్థపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది.