నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న 'ది ప్యారడైజ్' మూవీ దాదాపు రేసు నుంచి తప్పుకున్నట్లే కనిపిస్తోంది. తొలుత మార్చి 26న విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, షూటింగ్ ఆలస్యం కావడం, గ్రాఫిక్స్ పనులు ఉండటంతో ఈ సినిమాను జూన్ 25 లేదా ఆ నెల చివరి వారంలో విడుదల చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' సినిమాపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం మార్చి 27న చరణ్ బర్త్ డే కానుకగా రావాల్సి ఉంది. అయితే షూటింగ్ బ్యాలెన్స్ ఉండటంతో మే 1వ తేదీకి వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కానీ ఆ తేదీన అఖిల్ అక్కినేని 'లెనిన్' మూవీ రిలీజ్ ఉండటంతో, చరణ్ సినిమా మే నెలాఖరు లేదా జూన్‌కు వెళ్లే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ రెండు భారీ ప్రాజెక్టుల నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మంచి హైప్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా 'పెద్ది' సినిమాలోని 'చికిరి చికిరి' సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. త్వరలోనే సెకండ్ సింగిల్ అప్‌డేట్ ఇచ్చే సమయంలోనే మేకర్స్ విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. మరి ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎప్పుడు పోటీ పడతాయో వేచి చూడాలి.
Share