Current Date: 28 Aug, 2026

వరద ప్రవాహంలో సిలిండర్ల వేట

భారీ వర్షాలు, తీవ్రమైన వరదల కారణంగా నేపాల్‌లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. అయితే ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నారాయణీ నదిలో కొట్టుకుపోతున్న గ్యాస్ సిలిండర్ల కోసం స్థానిక ప్రజలు తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. విలయం తర్వాత నేపాల్‌లో నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడటంతో వరద ఉద్ధృతిని సైతం లెక్కచేయకుండా ప్రమాదకర పరిస్థితుల్లో సిలిండర్లను ఎత్తుకెళ్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.