Current Date: 28 Aug, 2026

నేపాల్ వరదలు.. ఏపీ యాత్రికులకు తప్పిన ప్రమాదం!

నేపాల్‌లో వరద ప్రమాదం నుంచి ఏపీకి చెందిన 26 మంది యాత్రికుల బృందం అదృష్టవశాత్తూ సురక్షితంగా బయటపడింది. వీరు ట్రావెల్స్ ద్వారా మానస సరోవర యాత్రకు వెళ్లారు. వీరితో ప్రయాణించిన కొందరు యాత్రికులు గల్లంతైనట్లు సమాచారం. కాగా వరదల్లో రాష్ట్రానికి చెందినవారు ఎవరైనా చిక్కుకున్నారా అని ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఢిల్లీ AP భవన్‌లో కంట్రోల్ రూమ్ (011-23384016, 011-23387089, వాట్సాప్-9059824101) ఏర్పాటు చేసింది.