Current Date: 05 Oct, 2024

రాజమండ్రిలో ఏటీఎంలో నింపాల్సిన డబ్బుతో ఉద్యోగి పరార్

రాజమండ్రి దానవాయిపేటలో హిటాచి సంస్థకు చెందిన కాంట్రాక్టు ఉద్యోగి తన చేతివాటం ప్రదర్శించారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్రాంచ్‌ పరిధిలో ఉన్న ఏటీఎంలలో డిపాజిట్‌ చేయాల్సిన  రెండున్నర కోట్ల రూపాయలతో ఉడాయించారు. పరారైన వ్యక్తిని అశోక్ కుమార్ గా గుర్తించారు. హిటాచి సంస్థ ఉద్యోగులను దారి మళ్లించి డబ్బులు ఎత్తుకెళ్లారు. దానవాయిపేట హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి హిటాచి ఏజెన్సీ ఉద్యోగి డబ్బులు డ్రా చేశాడు. ఏటీఎంలో నింపాల్సిన సమయంలో సుమారు 2.4కోట్ల రూపాయలతో అశోక్ పరారయ్యాడు. దీంతో రాజమండ్రి పోలీసులకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. మూడేళ్లుగా హిటాచి మేనేజ్ మెంట్ సంస్థలో అశోక్ క్యాష్ ఫిల్లింగ్ బాయ్‌గా పని చేస్తున్నట్లు హిటాచి సంస్థకు చెందిన కొందరు చెబుతున్నారు. మొత్తం 19 ఏటీఎంలలో డబ్బులు ఫిల్లింగ్ చేయాల్సి ఉండగా అశోక్ ఈ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో కూడా ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన రూ.1.5కోట్ల నగదుతో ఓ వ్యాన్ డ్రైవర్ పరారయ్యాడు.

Share