Current Date: 27 Nov, 2024

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో "తెలుగు వర్సెస్ తమిళ్!!!

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అటు మిత్రదేశాలు, ఇటు శత్రుదేశాలు కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. డెమోక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ ఎన్నికల బరి నుంచి వైదొలిగి 59ఏళ్ల కమలా హారిస్ కు మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో తెలుగు వర్సెస్ తమిళ అనే ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది! అవును  అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారాలు రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఒకపక్క రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో దూసుకెళ్లిపోతున్నారని అంటున్నారు. ప్రధానంగాఆయనపై జరిగిన కాల్పుల ఘటన అనంతరం లెక్కలు మరింత మారిపోయాయని చెబుతున్నారు. ఆయన గెలుపు అవకాశాలు భారీగా పెరిగాయనే కామెంట్లు వినిపించాయి.ఈ నేపథ్యంలోఎన్నికల బరినుంచి జో బైడెన్ వైదొలగడంతో పాటు కమలా హారిస్ కు మద్దతు పలికారు. దీంతో డెమోక్రటిక్ పార్టీ తరుపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడే అవకాశమున్న నేతల్లో ఆమె ముందు వరుసలో ఉన్నారు. ఆమె పేరు ఖరారైతే తొలి ఆసియన్ అమెరికన్ నాయకురాలిగా ఆమె రికార్డ్ సృష్టిస్తారు. 

Share