Current Date: 27 Nov, 2024

బంగారం, ఫోన్లు ఇక చౌక ధరలు పెరిగే వస్తువులివే

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన సెంట్రల్ బడ్జెట్‌తో కొన్ని వస్తువుల ధరలు తగ్గనుండగా.. మరికొన్ని వస్తువుల ధరలు పెరగనున్నాయి. ముఖ్యమైన వాటిపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్టుగా ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీంతో చాలా వస్తువులు వినియోగదారులకు చౌకగా దొరికే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా.. మొబైల్ ఫోన్ ధరలు, బంగారం, వెండి, రాగి ధరలను తగ్గిస్తున్నట్లు వెల్లడించారు.  ధరలు తగ్గేవి : *మొబైల్ ఫోన్లు, మొబైల్ ఛార్జర్లపై బీసీడీని 15 శాతానికి తగ్గింపు *బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీని 6 శాతానికి, ప్లాటినంపై 6.4 శాతానికి తగ్గింపు *క్యాన్సర్ చికిత్స మందులు ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుండి మినహాయింపు *ఫోన్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన లిథియం-అయాన్ బ్యాటరీలపై పన్ను రేటు కూడా తగ్గింపు *ఇ-కామర్స్‌పై TDS రేటు 1 శాతం నుండి 0.1 శాతానికి తగ్గింపు. *ఫెర్రోనికెల్, బ్లిస్టర్ కాపర్‌పై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ పూర్తిగా తొలగింపు  *లెదర్‌ ఉత్పత్తులపై పన్ను శాతం తగ్గింపు   ధరలు పెరిగేవి :  *అమ్మోనియం నైట్రేట్‌పై కస్టమ్స్ డ్యూటీని 10 శాతానికి పెంపు *బయోడిగ్రేడబుల్ కాని ప్లాస్టిక్‌లపై 25 శాతానికి కస్టమ్స్ డ్యూటీ పెంపు *నిర్దేశిత టెలికాం పరికరాలపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ 10 శాతం నుంచి 15 శాతానికి పెంపు

Share