Current Date: 14 Feb, 2026

అసెంబ్లీకి రాని అరవ శ్రీధర్.. పరువు తీసేశాడంటున్న జనసేన

రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. ఓ ప్రభుత్వ ఉద్యోగినితో రాసలీలలు వీడియోలు వెలుగులోకి రావడం, దీనిపై పార్టీ అధిష్టానం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని వేయడంతో ఆయన తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల వల్ల తోటి ఎమ్మెల్యేలకు ముఖం చూపించలేక, అవమాన భారంతోనే ఆయన సభకు హాజరుకావడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అధిష్టానం ఆదేశించినప్పటికీ, అసెంబ్లీ సమావేశాలకు రావద్దని ఎవరూ చెప్పలేదని సొంత పార్టీ ఎమ్మెల్యేలే వ్యాఖ్యానిస్తున్నారు. వ్యక్తిగత బలహీనతలతో పార్టీ పరువు తీస్తున్నారంటూ కొందరు జనసేన నేతలు ఆయనపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పదవుల విలువ తెలుసుకోకుండా ఇలా ప్రవర్తించడం సరికాదని వారు బహిరంగంగానే విమర్శిస్తుండటం గమనార్హం. మరోవైపు నియోజకవర్గంలోనూ శ్రీధర్ అభివృద్ధి పనులకు దూరంగా ఉంటున్నారని సమాచారం. ఆయన గైర్హాజరీతో టీడీపీ ఇన్‌చార్జ్ ముక్కా రూపానందరెడ్డి నియోజకవర్గ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. కేవలం సిగ్గుపడే అసెంబ్లీకి వెళ్లడం లేదా లేక మరేవైనా ఇతర వ్యక్తిగత కారణాలు ఉన్నాయా అనేది రానున్న రోజుల్లో స్పష్టత రానుంది.