Current Date: 14 Feb, 2026

ధనుష్‌తో పెళ్లిపై హీరోయిన్ మృణాల్ సెటైర్.. తేదీ మార్పు!

ధనుష్-మృణాల్ ఠాకూర్ డేటింగ్ చేస్తున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఒక ఫంక్షన్‌లో వీరిద్దరూ సన్నిహితంగా కనిపించినప్పటి నుండి ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి. అయితే, ఫిబ్రవరి 14న వీరు వివాహం చేసుకోబోతున్నారంటూ తాజాగా వస్తున్న కథనాలపై నటి మృణాల్ ఠాకూర్ ఘాటుగా స్పందించారు. ఈ పుకార్లను ఆమె పూర్తిగా కొట్టిపారేస్తూ.. "ఫిబ్రవరి 14 కాస్తా ఏప్రిల్ 1 (ఏప్రిల్ ఫూల్స్ డే)గా మారినట్లు అనిపిస్తోంది" అంటూ ఎద్దేవా చేశారు. ఇలాంటి వార్తలు ఎవరు మొదలుపెడుతున్నారో అర్థం కావడం లేదని, తాను అధికారికంగా చెప్పినట్లుగా అబద్ధాలను ప్రచారం చేయడం భయంకరంగా ఉందని మృణాల్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఈ విషయంలో అస్పష్టంగా ఉన్నప్పటికీ, ఈసారి మాత్రం తనకు ధనుష్‌కు మధ్య ఏమీ లేదని ఆమె కుండబద్దలు కొట్టారు. మృణాల్ ఇచ్చిన ఈ స్పష్టతతో గత కొన్నాళ్లుగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడినట్లయింది. వ్యక్తిగత విషయాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను ఖండించిన ఆమె, ప్రస్తుతం తన పనిపైనే దృష్టి పెట్టినట్లు స్పష్టం చేశారు. మరి ఈ క్లారిటీ తర్వాత అయినా ఈ రూమర్లకు బ్రేక్ పడుతుందో లేదో చూడాలి.