Current Date: 05 Oct, 2024

అనసూయ పబ్లిసిటీ స్టంట్ హీరో ఫ్యాన్స్‌ను కెలికి!

యాంకర్ అనసూయ మళ్లీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్‌ను కెలికింది.  అనసూయ ప్రధాన పాత్రలో నటించిన సింబా మూవీ త్వరలో రిలీజ్ కానుంది. దాని ప్రమోషన్స్‌లో ఉన్న అనసూయ.. కావాలనే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌ని రెచ్చగొడుతున్నట్లు కనిపిస్తోంది. సడెన్‌గా అనసూయ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టింది. మరీ ఇంత చేతకాని వాళ్ల లాగ ఉంటే ఎలాంగడి.. నిజంగా మీకు కాలుతుందంటే నా మీద కాదు.. అస్తమానం నేను ఏ పని చేసినా ఆ టాపిక్ లాగే వాళ్లని అనండి దమ్ముంటే.. కానీ మీరు అలా చెయ్యరు కదా.. ఎందుకంటే మీకు అది చేతకాదు.. మీ హీరో లాగ ఆడవాళ్లని ఉద్దేశించి బూతులు తిట్టడం మాత్రమే వచ్చు.. కదా పాపం.. మీలాంటి వాళ్లు అందరూ త్వరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను. గెవ్ వెల్ సూన్.. వెళ్లి పని చూసుకోండి.. గుడ్ నైట్! అంటూ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌ను అనసూయ కెలికింది. కొత్త సినిమా రిలీజ్ అవుతుంది. మళ్లీ పబ్లిసిటీ కావాలి. అందుకే ఈ ట్రిక్స్  చేస్తున్నావా అనసూయ అంటూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.

Share