సార్వత్రిక ఎన్నికల్లో చాలా మంది టాలీవుడ్ హీరోలు ఓట్లు వేశారు. హైదరాబాద్‌లో ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఉదయాన్నే ఓటు వేశారు. చిరంజీవి, రామ్ చరణ్ సతీసమేతంగా వచ్చి ఓట్లు వేశారు. మహేష్ బాబు ఫ్యామిలీతో వచ్చి తన బాధ్యతను పూర్తి చేశాడు. జీవితా, రాజశేఖర్‌లు ఓటు హక్కుని వినియోగించుకున్నారు. కానీ ప్రభాస్ మాత్రం కనిపించలేదు. గత ఎన్నికల్లోనూ ప్రభాస్ ఓటు వేసిన దాఖలాలు లేవు.
ప్రభాస్‌పై నెటిజన్లు సెటైర్లు కురిపిస్తూ.. సీనియర్ హీరో రాజశేఖర్ ఫోటోను షేర్ చేస్తూ.. ప్రభాస్ ఓటు హక్కుని వినియోగించుకున్నాడంటూ ట్రోల్స్ మొదలుపెట్టారు. ప్రభాస్‌కు అసలు ఓటు హక్కు లేదా? ఎప్పుడూ బయటకు వచ్చి ఓటు వేసినట్టుగా కూడా కనిపించలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ప్రభాస్ హైదరాబాద్‌లో ఉండి కూడా ఓటు వేయకపోవడానికి కారణాలేంటో తెలియడం లేదు.
నిజానికి మూడు రోజుల క్రితమే.. ప్రభాస్ కన్నప్ప సెట్స్‌లోకి వచ్చాడని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలా చూస్తే ప్రభాస్ ఇక్కడే ఉండి కూడా ఓటు హక్కుని వినియోగించుకోవడం లేదని తెలుస్తోంది. అసలు ప్రభాస్‌కు తెలంగాణలో ఓటు హక్కుందా? ఏపీలో ఉందా? అనేది క్లారిటీ లేదు.