ఐపీఎల్ 2024 సీజన్ చరమాంకానికి చేరుకుంది.ప్లేఆఫ్స్‌కి చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కి వరంలా వర్షం వచ్చింది. దాంతో మ్యాచ్ ఆడకుండానే కోల్‌కతా టీమ్ ప్లేఆఫ్స్‌కి చేరుకోగా.. గుజరాత్ టైటాన్స్ టీమ్ ఇంటిబాట పట్టింది.
భారీ వర్షం కారణంగా రాత్రి 10.30 గంటల వరకు అందరూ స్టేడియంలోనే వెయిట్ చేశారు. కానీ.. గ్రౌండ్ చిత్తడిగా మారడంతో మ్యాచ్ రిఫరీ గుజరాత్-కేకేఆర్ మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు. దాంతో అహ్మదాబాద్ స్టేడియం నుంచి కోల్‌కతా టీమ్ ఈలలు వేసుకుంటూ వెళ్లగా.. గుజరాత్ టీమ్ బాధతో నిష్క్రమించింది. మ్యాచ్ రద్దు కారణంగా ఇరు జట్లకు చెరో పాయింట్ వచ్చింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ఖాతాలో 11 పాయింట్లు చేరాయి. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగనున్న మ్యాచ్‌లో గుజరాత్ గెలిచినా గరిష్టంగా 13 పాయింట్లే సాధిస్తుంది. ఇప్పటికే 13 పాయింట్ల కంటే ఎక్కువ ఉన్న టీమ్స్ నాలుగు ఉండటంతో గుజరాత్ కథ ముగిసినట్లయ్యింది.
కోల్‌కతా 19 పాయింట్లు, రాజస్థాన్ 16, సీఎస్కే 14, హైదరాబాద్ 14 పాయింట్లతో నిలిచాయి. గుజరాత్ ఈ పాయింట్లను అధిగమించడం అసంభవం. దీంతో ఐపీఎల్ 2024 సీజన్‌లో నాకౌటైన మూడో జట్టుగా గుజరాత్ టైటాన్స్ నిలుస్తుంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ టోర్నీ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే