Current Date: 06 Jul, 2024

Movie star campaigning for BJP candidate in AP


అందాల భామ నమిత ఏపీలో ఎన్నికల ప్రచారానికి వచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీజేపీ నేత సత్యకుమార్ తరఫున నమిత తన భర్తతో కలిసి ధర్మవరంలో  ఎన్నికల ప్రచారంలో ఈ రోజు పాల్గొన్నారు.  ఇక్కడి చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధర్మవరం టౌన్ లో నిర్వహించిన రోడ్ షోలో నమితను చూసేందుకు జనాలు భారీగా తరలివచ్చారు. 
ఏపీలో పొత్తు కారణంగా ధర్మవరం అసెంబ్లీ స్థానం బీజేపీకి కేటాయించారు. ఇక్కడ్నించి సత్యకుమార్ పోటీ చేస్తుండగా, వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బరిలో ఉన్నారు.