హీరో రజినీకాంత్ జీవితం ఎంతో మందికి స్పూర్తి. కండెక్టర్ స్థాయి నుంచి సూపర్ స్టార్ స్థాయికి ఆయన ఎదిగిన తీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం. రజినీ స్టైల్ కు, డైలాగ్ డెలివరీకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఆరు పదుల వయసులో కూడా ఎంతో ఎనర్జిటిక్‌గా రజిని కనిపిస్తున్నారు.
రజినీ గురించి మనకి తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఆయన ఏటా హిమాలయాలకు వెళ్లి ధ్యానం చేస్తారు. అలానే ఆఫ్ స్క్రీన్‌పై రజినీ చాలా నిరాండబరంగా గడుపుతారు. సూపర్ స్టార్ అన్న అహం ఏ మాత్రం ఉండదు, ఈ క్వాలిటీ చాలా కొద్ది మంది నటుల్లో మాత్రమే ఉంటుంది. అలాంటి అద్భుతమైన రజినీ జర్నీని వెండితెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్.
రజినీకాంత్ బయోపిక్ ను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియాద్వాలా నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రజినీకాంత్ పాత్రలో అతని మాజీ అల్లుడు హీరో ధనుష్ నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ధనుష్ ఇళయరాజా బయోపిక్ లో నటిస్తున్నాడు.