Current Date: 18 Nov, 2024

భాష పట్ల గౌరవంతో మరాఠీ నేర్చుకున్నా... ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్  ప్రచారం కొనసాగిస్తున్నారు. ఆయన బల్లార్పూర్ లో ఎన్డీయే అభ్యర్థి సుధీర్ ముంగటివార్ కు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పవన్ ప్రసంగిస్తూ తనకు మరాఠీ భాష అంటే గౌరవం అని వెల్లడించారు. భాష పట్ల గౌరవంతో మరాఠీ నేర్చుకున్నానని, తన ఇద్దరు పిల్లలతో మరాఠీలో మాట్లాడతానని తెలిపారు. విదేశీ భాషలు నేర్చుకోవడం పై ఆసక్తి చూపించే మనం మన సరిహద్దు రాష్ట్రాల భాషలు కూడా నేర్చుకోవాలి కదా అని సున్నితంగా చురక అంటించారు. ప్రతి ఒక్కరూ కనీసం ఐదు ప్రాంతీయ భాషలు నేర్చుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు. ఇక, రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ తాను ఏపీలో మార్పు తీసుకొచ్చి చూపించానని, వైసీపీని ఓడించలేరు అంటే ఓడించి చూపించానని వ్యాఖ్యానించారు. ఇప్పుడు మరాఠా ప్రజలకు కూడా ఎన్డీయే ప్రభుత్వాన్ని గెలిపించి, అభివృద్ధి కొనసాగేందుకు దోహదపడాలని పిలుపునిచ్చారు 

Share