Current Date: 18 Nov, 2024

ఏపీకి మరో తుపాను గండం.. 23న బంగాళాఖాతంలో అల్పపీడనం

ఏపీకి మరో తుపాను ముప్పు పొంచి ఉందని, ఈ నెల 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఆపై పశ్చిమ వాయవ్యంగా పయనించే క్రమంలో తుపాను దిశ మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నెల 26, లేదంటే 27 నాటికి శ్రీలంకకు ఉత్తర దిశగా రానుందని పేర్కొన్నారు. దీని ప్రభావం రాయలసీమ, దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై పడే అవకాశం ఉందని హెచ్చరించారు. మరోవైపు, బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పుగాలుల ప్రభావంతో రాయలసీమ, కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో రాయలసీమలో పలుచోట్ల, దక్షిణ కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

Share