Current Date: 05 Oct, 2024

సిబ్బంది అవినీతికి పాల్పడితే తాటతీస్తా

సిబ్బంది అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని, నిజాయితీగా పనిచేసి ప్రజల మన్ననలను పొందితే  రివార్డులు అందజేసి ప్రోత్సహిస్తామని సీపీ డా. శంఖబ్రత బాగ్చి అన్నారు. శనివారం  ఉదయం పోలీస్ కమిషనరేట్ లో క్రైమ్ రివ్యూ సమావేశాన్ని సీపీ నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి క్రైమ్ మీటింగ్ అని తెలిపారు. నిజాయితీగా పనిచేసే పోలీస్ సిబ్బంది సేవలను గుర్తిస్తూ అధికారులు సిబ్బందికి రివార్డులు ఇస్తున్నామన్నారు. ప్రతి పోలీస్ అధికారి, పోలీస్ సిబ్బంది, హోమ్ గార్డ్ నిజాయితీగా ప్రజాసేవ చేయాలని పిలుపునిచ్చారు. విశాఖ ప్రజలు పోలీస్ సేవలను గుర్తించి కొనియాడాలని ఆకాంక్షించారు. అవినీతికి పాల్పడిన కొందరి పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. అవినీతికి పాల్పడిన వారిపై సస్పెన్షన్ తో పాటు అవసరమైతే డిస్మిస్ చేస్తామని హెచ్చరించారు. 

Share