బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీ బాదాడు. ఇది ఆసీస్ గడ్డపై అతనికి తొలి శతకం. అలాగే ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న తొలిసారే యువ ఆటగాడు శతకం నమోదు చేయడం గమనార్హం. జైస్వాల్ కంటే ముందు ఇలా తమ తొలి ఆసీస్ పర్యటనలో ఎంఎల్ జైసింహా, సునీల్ గవాస్కర్ సెంచరీలు బాదారు. ఈ ముగ్గురూ రెండో ఇన్నింగ్స్‌లోనే శతకాలు నమోదు చేయడం గమనార్హం. అలాగే ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన రెండో యంగెస్ట్ ఓపెనర్‌గా జైస్వాల్ రికార్డుకెక్కాడు. అతడు 22ఏళ్ల 330 రోజుల వయసులో ఈ ఘనత సాధించగా కేఎల్ రాహుల్ 22 ఏళ్ల 263 రోజుల వయసులో ఈ ఫీట్‌ను అందుకున్నాడు. అలాగే భారత్ తరఫున 23 ఏళ్ల వయసులోపే టెస్టుల్లో అత్యధిక సెంచరీలు కొట్టిన ఐదో బ్యాటర్ జైస్వాల్ (4).
Share