హైదరాబాద్‌లోని AIG ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి బాలకృష్ణను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఆస్పత్రికి వచ్చి బాలయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కాగా కాకినాడ పోర్టులో జరిగిన సినిమా షూటింగ్‌లో బాలకృష్ణ గాయపడ్డారు. మరోవైపు బాలకృష్ణ వేగంగా కోలుకోవాలని డైరెక్టర్ గోపీచంద్ మలినేని బెంగళూరులోని ఆలయంలో హోమం చేస్తున్నారు.