పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రజత పతకం సాధించాడు. నాలుగేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన నీరజ్ చోప్రా.. పారిస్‌లో మాత్రం రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. అనూహ్యరీతిలో పాకిస్థాన్‌కు చెందిన జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ పారిస్ 92.97 మీటర్లు జావెలిన్ విసిరి గోల్డ్‌మెడల్‌ను ఎగరేసుకుపోయాడు. వాస్తవానికి నీరజ్ చోప్రా ఫైనల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చలేకపోయాడు. ఆరు సార్లు జావెలిన్‌ను విసిరిన చోప్రా.. రెండో ప్రయత్నంలో అత్యధికంగా 89.45 మీటర్ల దూరం విసిరాడు. మిగతా ఐదు ప్రయత్నాల్లోనూ ఫౌల్ చేశాడు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 5కి చేరింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్జోత్ సింగ్‌తో కలిపి కాంస్య పతకాలు గెలిచింది. అలానే పురుషుల 50 మీటర్ల రైఫిల్‌లో షూటర్ స్వప్నిల్ కుశాలే కాంస్య పతకం,హాకీలో భారత పురుషుల జట్టు కూడా కాంస్యం పతకాన్ని గెలుపొందిన విషయం తెలిసిందే. దాంతో చోప్రాతో కలిసి పతకాల సంఖ్య 5కి చేరింది.
Share